Monday, 16 May 2011

సెగ , గనేరియా వంటి - సుఖ వ్యాదులకు



ఉసిరిక చెట్టు చెక్క పచ్చిది 20 గ్రాములు  తీసుకొని అందులో 20  గ్రాముల పసుపు పొడిని కలిపి తగినంత  తేనె కలిపి నూరాలి  . దీనిని  కుంకుడు కాయంత పరిమాణంలో  మాత్రలు కట్టి ఎండించి బద్రపరుచుకోవాలి  .

ఈ మాత్రలు పుటకు ఒకటి చప్పున మజ్జిగతో  కానీ  బియం కడిగిన నీటితో గని సేవించాలి .  ఇలా రెండు పూతల సేవిస్తుంటే వరం రోజులలో పైన చెప్పిన  సుఖ వ్యాదులు హరిoచిపోతాయి .

స్త్రీల చనుకుదురుకు - చక్కని యోగం



ఊల్లి  గడ్డను  మెత్తగా దంచి ఆ ముద్దను స్థానాల వాపు పైన వేసి  పైన దూది  అంటించి  ఆ దూది వుడిపోకుండా బట్ట తో  కట్టుకోవాలి . ఇలా రాత్రి కట్టుకొని ఉదయం తీసి వేస్తుంటే చనుకుదురు  ఆనబడే వక్ష స్థల  వాపు  తగ్గిపోతుంది

ఆనేలకు - అద్భుతయోగం


ఆముదం పావు చెంచా  , జిల్లెడుపాలు పది చుక్కలు కలిపి బాగా రంగరించి  ఆమిశ్రామాన్ని  ఆనేల పైన రాత్రి లేపనం చేసి ఉదయం కడుగుతుంటే ఆనెలు కరిగిపోయి తిరిగి మరల పుట్టావు .

కొరుకుడు రోగం ( సిఫిలిస్ )



కొరుకుడు లేక సిఫిలిస్ అనే సుఖ వ్యాది సోకినా వాళ్ళు మనదేశంలో  లెక్క పెట్టడానికి వీలు లేనంత మంది వున్నారు  . వీళ్ళంతా ఇపటికే ఎన్నో రకాల మందులు వాడి  , ఆ వ్యాది తగ్గక తిరగాపెడుతూ  నానా బాధలు పడుతునారు . అలాంటివారి కోసం ప్రసిద్ద ఆయుర్వేద శాస్త్రవేత్త ఒక అద్భుతమైన యోగం మనకు అందించారు .

వేపాకు పొడి 80  గ్రాములు , కరక్కాయ పొడి 10  గ్రాములు , వుసిరికకాయ పొడి 5  గ్రాములు కలిపి నిలువచేసుకోవాలి . ఈ చూర్ణాన్ని  రెండుపూటలా ఆహారానికి గంట ముందుగ మూడు వేళ్ళకు వచ్చ్చినంత పొడి ఒక కప్పు మంచి నీటితో  కలిపి సేవిస్తువుంటే కొరుకుడు వ్యాది హరించిపోతుంది . 


Friday, 13 May 2011

దురదలు - దద్దుర్లు



చర్మం పైన దురదలు  , దద్దుర్లు పుట్టి బాధపడేవారు తమసమస్యను శీతపిత్త  సమస్య అని  తెలుసుకోవాలి  . అలాంటివారంత రోజు  గోరువెచ్చని ఆవనునేతో  ఒళ్ళంతా సున్నితంగా రుద్దుకొని అరగంట తరువాత బరించ కలిగినంత వేడి నీటితో స్నానం చేస్తుండాలి . దాంతో పాటు గోరు వెచ్చని త్రిఫల కాషాయం  ఒక కప్పు తాయారు చేసుకొని అందులో ఒక చెంచ తేన కలిపి నిద్రించేముందు తాగాలి . అలాగే ఒక చెంచ అల్లం రసం , 10  గ్రాముల పాత బెల్లం కలిపి దంచి ముద్దచేసి ఉదయం , సాయంత్రం చప్పరించి తినాలి . ఇలా చేస్తుంటే దురదలు , దద్దుర్లు , మంటలు మటు మాయం .     

Wednesday, 11 May 2011

చుండ్రుకు - చండ్రమైన యోగం / dandruff



చుండ్రుతో బాధపడేవారు మామిడి తెనక లోపల ఉండే పప్పు  , కరక్కాయలపొడి సమానంగా తీసుకొని తగినన్ని దేశవాళి  గేదె పాలతో కలిపి మెత్తగా నూరి  , తలకు పట్టించాలి . ఒక గంట ఆగి  కుంకుడుకాయ లేక సికాకాయ రసంతో స్నానం చేయాలి  . ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే క్రమంగా చుండ్రు పూర్తిగా హరించిపోతుంది .  


బొల్లి మచ్చాలకు - బలమైన యోగం




వుసిరికకాయల పొడి , చండ్రచెట్టు చేవపొడి  సమానంగా  కలిపి నిలువచేసుకోవాలి . అదేవిదంగా బావంచల గింజలను విడిగా దంచి జల్లించి వుంచుకోవాలి . ఒక గ్లాస్ మంచి నీటిలో ఒక చెంచ ఉసిరిక , చండ్ర కలిపినా పొడి వేసి ఒక కప్పు కషాయానికి మరిగించి వడపోసి అందులో పావు చెంచ బావంచల పొడి కలిపి తాగాలి . ఇలా రెండుపూటలా ఆహారానికి గంట ముందుగ క్రమం తప్పకుండ సేవిస్తుంటే బోల్లివల్ల ఏర్పడిన తెల్ల మచ్చలు క్రమంగా తగ్గుతాయి .